ఇస్రో కొత్త చైర్మన్ గా వి. నారాయణన్...! 22 h ago
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త చైర్మన్ గా వి.నారాయణన్ నియమితులయ్యారు. ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎస్ సోమనాథ్ పదవీ కాలం ఈ నెలతో ముగియనుంది. ఈ క్రమంలో వి.నారాయణన్‌ను కొత్త చైర్మన్‌గా నియమిస్తూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ మంగళవారం ప్రకటించింది. జనవరి 14వ తేదీన నారాయణన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆయన వలియమలాలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. రాకెట్, స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్‌కు సంబంధించి 4 దశాబ్దాలకుపైగా అనుభవం ఉంది.